రబీ రుణ లక్ష్యం.. రూ.782.55 కోట్లు | rs.782.55 crores in rabi season loan target | Sakshi
Sakshi News home page

రబీ రుణ లక్ష్యం.. రూ.782.55 కోట్లు

Oct 12 2016 11:25 PM | Updated on Sep 4 2017 5:00 PM

ప్రస్తుత రబీ సీజన్‌లో రూ.782.55 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ (ఎల్‌డీఎం) ఎల్‌.జయశంకర్‌ వెల్లడించారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : ప్రస్తుత రబీ సీజన్‌లో రూ.782.55 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ (ఎల్‌డీఎం) ఎల్‌.జయశంకర్‌ వెల్లడించారు. ఈ నెల చివరి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. కాగా.. సెప్టెంబర్‌ 30తో ముగిసిన 2016 ఖరీఫ్‌ రుణ లక్ష్యాన్ని వంద శాతం సాధించినట్లు తెలిపారు. 5.95 లక్షల మంది రైతులకు రూ.4,434 కోట్ల పంట రుణాలు, 82 వేల మందికి రూ.550 కోట్ల బంగారు రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ టర్మ్‌ రుణాల పంపిణీ కొనసాగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement