జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు రోహిత్‌ | rohit elect to national rifle shooting | Sakshi
Sakshi News home page

జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు రోహిత్‌

Oct 25 2016 10:25 PM | Updated on Sep 4 2017 6:17 PM

జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు రోహిత్‌

జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు రోహిత్‌

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నవంబర్‌ 26, 27, 28 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు కదిరి మున్సిపల్‌ పరిధిలోని బ్లూమూన్‌ కళాశాల విద్యార్థి రోహిత్‌ ఎంపికయ్యాడు.

కదిరి అర్బన్‌ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నవంబర్‌ 26, 27, 28 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు కదిరి మున్సిపల్‌ పరిధిలోని బ్లూమూన్‌ కళాశాల విద్యార్థి రోహిత్‌ ఎంపికయ్యాడు. వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూర్‌లో ఈ నెల 14,15,16వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పీప్‌సైట్‌ విభాగంలో కొత్తపల్లి చెందిన రోహిత్‌ తన ప్రతిభను చాటి రజతపథకం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. రోహిత్‌ బ్లూమూన్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 2012–13లో 7వ తరగతి చదివే సమయంలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న గన్‌ఫర్‌ గ్లోరి రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు.

అదే ఏడాది గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రోహిత్‌ బంగారు పతకం సాధించాడు. అనంతరం 2013–14, 2014–15,2015–16లో వరుసగా బంగారు, వెండి, రజత పతకాలు సాధించి అతి చిన్న వయసులో నాలుగుసార్లు 2016–17 రజతం సాధించి వరుసగా ఐదుసార్లు జాతీయజట్టుకుఎంపిక కావడం విశేషం. జాతీయస్థాయిలో ఈ సారి మెడల్‌ సాధించడమే లక్ష్యంమని రోహిత్‌ తెలిపాడు. గన్‌ ఫర్‌ గ్లోరీ రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీ హైదరాబాదులో కోచ్‌ సుశీల్‌కుమార్‌ పర్యవేక్షణలో రోహిత్‌ శిక్షణ తీసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement