రిటైర్డ్‌ తహసీల్దార్‌కు తప్పని ‘వెబ్‌ల్యాండ్‌’ పాట్లు | retired Tahasildar 'vebland' problems | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ తహసీల్దార్‌కు తప్పని ‘వెబ్‌ల్యాండ్‌’ పాట్లు

Aug 23 2016 1:19 AM | Updated on Sep 4 2017 10:24 AM

రిటైర్డ్‌ తహసీల్దార్‌కు తప్పని ‘వెబ్‌ల్యాండ్‌’ పాట్లు

రిటైర్డ్‌ తహసీల్దార్‌కు తప్పని ‘వెబ్‌ల్యాండ్‌’ పాట్లు

వెబ్‌ ల్యాండ్‌లో తన భూమి వివరాల నమోదు కోసం రిటైర్డ్‌ తహసీల్దార్‌ ఎం.బలరామిరెడ్డికి సైతం అవస్థలు తప్పలేదు. సోమవారం రాయదుర్గం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ అప్జల్‌ఖాన్‌కు అర్జీ ఇచ్చారు.

రాయదుర్గం అర్బన్‌ : వెబ్‌ ల్యాండ్‌లో తన భూమి వివరాల నమోదు కోసం రిటైర్డ్‌ తహసీల్దార్‌ ఎం.బలరామిరెడ్డికి సైతం అవస్థలు తప్పలేదు. సోమవారం రాయదుర్గం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ అప్జల్‌ఖాన్‌కు అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా బలరామిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ 1994లో తనభార్య పుష్పలత, తన తమ్ముని భార్య సరస్వతి పేరిట రాయదుర్గం పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో సర్వే నంబర్‌ 310బీ–1లో 2.10 ఎకరాల భూమిని ఎన్‌సీ శ్రీనివాసులు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతంలోను ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందామని, అయితే నేడు వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదు కాలేదన్నారు. వీఆర్వో, ఆర్‌ఐ, డిప్యూటీæతహసీల్దార్‌లు వెరిఫికేషన్‌ చేసిన తర్వాత తన వద్దకు ఫైలు వస్తే అప్పుడు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాల్సి ఉందని, పల్స్‌ సర్వే, సెలవుల్లో వెళ్లడం వల్ల సిబ్బంది లేకపోవడంతో జాప్యం జరుగుతోందని తహసీల్దార్‌ చెప్పారన్నారు. సిబ్బంది వచ్చిన తర్వాత వెరిఫికేషన్‌ చేయించి, అప్‌డేట్‌ చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు.   

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement