ఆర్‌ఎస్‌ఆర్‌లో ‘చుక్కలు’ పునః పరిశీలన | reobserve dot in rsr | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఆర్‌లో ‘చుక్కలు’ పునః పరిశీలన

Sep 10 2016 9:08 PM | Updated on Sep 4 2017 12:58 PM

రీ సెటిల్‌మెంటు రిజిస్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌)లో గ్రామాలు, సర్వే నెంబరు వారీగా పట్టాదారు స్థానంలో చుక్కలున్న భూముల గుర్తింపును మరోసారి పరిశీలించాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ ఆదేశించారు.

  •  అనెగ్జర్‌–5ను రివైజ్డ్‌ చేయాలని సీసీఎల్‌ఏ ఆదేశం
  •  
    కర్నూలు(అగ్రికల్చర్‌): రీ సెటిల్‌మెంటు రిజిస్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌)లో గ్రామాలు, సర్వే నెంబరు వారీగా పట్టాదారు స్థానంలో చుక్కలున్న భూముల గుర్తింపును మరోసారి పరిశీలించాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల వివరాలను 5 రకాల జాబితాల్లో చేర్చారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న వాటిని అనెగ్జర్‌– 5లో చేర్చి ప్రభుత్వానికి పంపారు. చుక్కలున్న  కొన్ని సర్వే నెంబర్లను అనెగ్జర్‌ – 5లో పెట్టకుండా అవగాహన లోపంతో రెవెన్యూ సిబ్బంది అ¯ð గ్జర్‌ 1లో పెట్టి అసైన్డ్‌ భూములుగా చూపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో  జాబితాను రివైజ్డ్‌ చేసి పంపాలని సీసీఎల్‌ఏ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలను జిల్లా కేంద్రానికి రప్పించి ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న చుక్కల భూములను ఏ జాబితాలో పెట్టారో పరిశీలింపజేస్తారు. అనెగ్జన్‌–1లో ఉన్న చుక్కల భూములను అనెగ్జర్‌–5లోకి తీసుకువస్తారు. చుక్కలున్న భూముల్లో 1955కు ముందు క్రయ,విక్రయాలకు సంబంధించి  సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిష్ట్రేషన్‌లు జరిగిన  భూములను ప్రయివేటు భూములుగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. రివైజ్డ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement