జిల్లా కోసం రేపటినుంచి రిలే దీక్షలు | Relay deeksHalu For District | Sakshi
Sakshi News home page

జిల్లా కోసం రేపటినుంచి రిలే దీక్షలు

Jul 24 2016 7:44 PM | Updated on Sep 4 2017 6:04 AM

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రాములు

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రాములు

గద్వాల న్యూటౌన్‌: గద్వాల జిల్లా సాధనలో భాగంగా మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఐక్య కార్యాచరణ వేదిక చైర్మన్‌ వెంకట్రాములు, కన్వీనర్‌ మధుసూదన్‌బాబు తెలిపారు.

గద్వాల న్యూటౌన్‌ : గద్వాల జిల్లా సాధనలో భాగంగా మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఐక్య కార్యాచరణ వేదిక చైర్మన్‌ వెంకట్రాములు, కన్వీనర్‌ మధుసూదన్‌బాబు తెలిపారు. ఆదివారం స్థానిక రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక పాతబస్టాండ్‌ ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని,  జిల్లా సాధించే వరకు శిబిరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఆమరణ దీక్షలకు సైతం తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. రెండు నియోజకవర్గాలోని 9 మండలాలకు చెందిన 8 లక్షల మంది ప్రజలు ఏకగ్రీవంగా జిల్లా కావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. అన్ని వసతులు, వనరులు ఉన్న గద్వాలను జిల్లా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు అంపయ్య, ఉశేన్, వాల్మీకి, వినోద్‌కుమార్, సాయిసవరణ్, కృష్ణ, హరిబాబు తదతరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement