మడుగు కాదు.. మైదానమే | rain in ptc ground | Sakshi
Sakshi News home page

మడుగు కాదు.. మైదానమే

Aug 30 2016 11:26 PM | Updated on Sep 4 2017 11:35 AM

మడుగు కాదు.. మైదానమే

మడుగు కాదు.. మైదానమే

అనంతపురంలో ప్రప్రథమంగా జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని పీటీసీలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంను కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించారు.

అనంతపురం న్యూసిటీ: అనంతపురంలో ప్రప్రథమంగా జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని పీటీసీలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంను కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించారు. ఈ నెల 29న కురిసిన వానకు స్టేడియం మడుగును తలపిస్తోంది. వర్షపునీటితో వాకర్స్, క్రీడాకారులు నడిచేందుకు కూడా వీల్లేకుండా పోయింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునైనా వర్షం వస్తే నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు.

మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు చాలాసార్లు ఏర్పాట్లను పరిశీలించారు. కానీ ఏం ప్రయోజనం..? వారి ముందుచూపు ఏమాత్రమో ఇట్టే అద్దం పడుతోంది.  స్టేడియం నుంచి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేసి ఉంటే చాలా బాగుండేదని నగరవాసులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement