ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Police Seized Red Sandalwood Logs In Chittoor District | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 18 2017 10:56 AM | Updated on Aug 21 2018 5:51 PM

తలకోన అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు.

యర్రావారిపాలెం(చిత్తూరు): చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు తమిళ కూలీలను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తలకోన అటవీ ప్రాంతంలో తమిళ కూలీలు ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు. ఎర్రచందనం తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మరో 11 మంది కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement