ట్రిపుల్‌ఐటీ నిర్వహణకు వసతుల పరిశీలన | place verification | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ నిర్వహణకు వసతుల పరిశీలన

Sep 17 2016 11:51 PM | Updated on Sep 4 2017 1:53 PM

21వ శతాబ్ది గురుకులం మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు

21వ శతాబ్ది గురుకులం మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ తరగతుల నిర్వహణకు అవసరమైన వసతులపై ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకులాన్ని శనివారం పరిశీలించారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఆర్డీవో బి.దయానిధిలు ఇక్కడి భవనాలను, వసతులను పరిశీలించారు.

ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ తరగతుల నిర్వహణకు అవసరమైన వసతులపై ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకులాన్ని శనివారం పరిశీలించారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఆర్డీవో బి.దయానిధిలు ఇక్కడి భవనాలను, వసతులను పరిశీలించారు. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ తరగతులు నూజువీడులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురుకుల వసతి గృహం, తరగతి గదులు, వసతి, కిచెన్‌ వంటి అంశాలను పరిశీలించారు. గురుకులంలో వసతులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ తరగతులు నిర్వహించాలా, లేకుంటే నూజువీడులోనే కొనసాగించాలా? అన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement