రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.
పరిషత్ ఎన్నికలపై దృష్టిసారించండి
Aug 9 2013 2:09 AM | Updated on May 29 2018 4:06 PM
అనకాపల్లి, న్యూస్‌లైన్ : రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం రింగ్‌రోడ్డులో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం నియోజకవర్గం నాయకులు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) తో సమీక్షించారు. మండల,జిల్లా పరిషత్ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ ఔత్సాహికులపై దృష్టి సారించాలన్నారు.
ఉత్సాహంగా పనిచేసే వారికే ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పించాలన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వారిని అభినందించారు. నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే కార్యకర్తలు శ్రమించి ఉంటే ఇంకా అద్భుత ఫలితాలు వచ్చేవన్నారు. కొణతాలను కలిసినవారిలో పార్టీ పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు (జానీ), రైతు విభాగం నాయకులు పిళ్లా కొండయ్యనాయుడు, మునగపాక మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, మునగపాక మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, సీనియర్ నాయకులు చక్రధర్, యువజన నాయకులు బుద్ధ రాజేష్, ఎంఎల్‌వి ప్రసాద్, ఏడువాకల నారాయణరావు, బుద్ధ నాగేశ్వరరావు ఉన్నారు.
మర్యాదపూర్వకంగా కలిసిన నాగులాపల్లి సర్పంచ్...
క్యాంపు కార్యాలయానికి వచ్చిన కొణతాలను మునగపాక మండలం నాగులాపల్లి సర్పంచ్ ఎన్. భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెసేతర పక్షాల మద్దతుతో పోటీ చేసిన భాస్కరరావు తన గెలుపులో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల సహకారం కూడా ఉండడంతో కొణతాలకు కృతజ్ఞతలు తెలిపారు. అతనిని కొణతాల అభినందించారు. ఈయన వెంట పెతకంశెట్టి రాజు ఉన్నారు.
Advertisement
Advertisement