కడప నగరంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివశంకర్ (34) అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో మృతి చెందాడు.
కడప అర్బన్ : కడప నగరంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివశంకర్ (34) అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. శివశంకర్ భార్య సుబ్బలక్షుమ్మ 2008లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంబంధిత కేసులో కోర్టుకు వాయిదాలకు తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో కిందపడడంతో తలకు దెబ్బతగిలి మృతి చెందాడు. చిన్నచౌకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.