గంట్యాడ మండలం గింజేరు వద్ద రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఓ ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది.
గంట్యాడ(విజయనగరం జిల్లా): గంట్యాడ మండలం గింజేరు వద్ద రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఓ ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కె.వెలగాడ గ్రామానికి చెందిన కుర్రాయి సన్యాసి(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
విజయనగరం నుంచి తామరాపల్లికి ఆటోలో వెళ్తుండగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.