breaking news
Hermit
-
40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్డౌన్ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. (photo cridit BBC) 40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్ స్మిత్(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్ రాన్నోచ్ మూర్ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్ ట్రీగ్‌లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్ మేకర్ లిజ్జీ మెక్కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్లో ‘ట్రైగ్ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు.. డెర్బీషైర్‌కు చెందిన కెన్ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. (photo cridit BBC) 22 వేల మైళ్లు ప్రయాణం... ప్రమాదం కెన్ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్ భూభాగమైన యుకాన్ చేరుకున్నాడు. కెన్ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా.. తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు. (photo cridit BBC) నో గ్యాస్, నో కరెంట్... గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్. గ్యాస్, కరెంట్ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్ పర్సనల్ లోకేటర్ బీకాన్ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్. కాపాడిన జీపీఎస్ పర్సనల్ లోకేటర్.. అయితే 2019లో తొలిసారి కెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్‌మేకర్ లిజ్జీ కెన్ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్ లోకేటర్ టెక్సాస్, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్ కేంద్రానికి ఎస్ఓఎస్ పంపడంతో కెన్ పరిస్థితి గురించి వారికి తెలిసింది. (photo cridit BBC) వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్. చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది... -
తాటి చెట్టును ఢీకొన్న ఆటో.. ఒకరి మృతి
గంట్యాడ(విజయనగరం జిల్లా): గంట్యాడ మండలం గింజేరు వద్ద రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఓ ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కె.వెలగాడ గ్రామానికి చెందిన కుర్రాయి సన్యాసి(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విజయనగరం నుంచి తామరాపల్లికి ఆటోలో వెళ్తుండగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సన్యాసినిపై గ్యాంగ్‌రేప్
బెంగాల్లో దారుణం స్కూల్లోకి చొరబడ్డ దొంగలు 71 ఏళ్ల నన్ నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం.. రూ.12 లక్షలతో పరారీ కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో నదియా జిల్లా గంగ్నాపూర్లో 71 ఏళ్ల ఓ క్రైస్తవ సన్యాసినిపై దోపిడీ దొంగల ముఠా అత్యాచారానికి పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటలకు కాన్వెంట్ స్కూల్లోకి చొరబడ్డ దొంగలు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి పైశాచికత్వం ప్రదర్శించారు. అనంతరం రూ.12 లక్షలను ఎత్తుకెళ్లారు. శనివారం పొద్దున ఈ విషయం తెలిసి స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహోదగ్రులయ్యారు.ఎన్‌హెచ్-34, సీల్దా-రాణాఘాట్ రైలు మార్గంలోని పట్టాలపై ధర్నా చేశారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ముగ్గురు నుంచి నలుగురు దొంగలు ఈ దారుణంలో పాలుపంచుకొని ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఉదయం స్కూలుకు వచ్చిన హాస్టల్ సిబ్బంది.. విషయం తెలుసుకుని సన్యాసినిని రాణాఘాట్ ఆస్పత్రికి తరలించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని మమత చెప్పారు. దొంగలు కాన్వెంట్‌లోని ప్రార్థన ఆలయాన్ని కూడా ధ్వసం చేశారని, అక్కడి పవిత్ర వస్తువులన్నింటినీ చిందరవందర చేశారని కోల్‌కతా ఆర్చిబిషప్ తెలిపారు. కాగా, పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించారు. -
నయనతార సన్యాసం?
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఆశ్చర్యకరమైన చర్చ సాగుతోంది. అదేమిటంటే నయనతార సన్యాసం స్వీకరించాలని తలుస్తున్నారట. నిజానికి నయనతార నట జీవితం ఉజ్వలంగా సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరీమె. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేల్ కాదల్ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన అన్భే నీ ఎంగే చిత్రం నిరాశ పరచినా నటిగా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంచలన నటి సూర్యతో మాస్, ఉదయనిధి సరసన నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం మాయ చేస్తూ బిజీగా వున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ బ్యూటీ రెండు మూడుసార్లు ప్రేమలో ఓడిపోయారు. నటుడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ కథలు కంచికి చేరడంతో విరక్తి చెందిన నయనతార ప్రేమ, పెళ్లి వద్దు అని సన్యాసం స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చారా అనే వార్త ప్రచారంలో ఉంది. ఇది చిత్ర పరిశ్రమను విస్మయం కలిగించిన వార్త. అంతేకాదు ఏడాది క్రితం ఈ భామ హిమాలయాలకు వెళ్లి అక్కడి సన్యాసులతో మాట్లాడి మనశ్శాంతి పొందారట. ఇంతకుముందు బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా, కోలీవుడ్ నటి రాగసుధ లాంటి వారు సన్యాసం పుచ్చుకున్నారు. అయితే నటి రాగసుధ మాత్రం మళ్లీ మనసు మార్చుకుని ఇటీవల నటుడు రంజిత్‌ను వివాహం చేసుకుని సంసార జీవితం అనుభవిస్తున్నారు. జీవితం లో పలు ఒడిదుడుకులను చవి చూసిన నయనతార సన్యాసం స్వీకరించాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఇటీవల ఆమె చిత్రాలను తగ్గించుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.