నూతన కల్లు విధానాన్ని రూపొందించాలి | New liquor policy to be set up | Sakshi
Sakshi News home page

నూతన కల్లు విధానాన్ని రూపొందించాలి

Aug 2 2016 9:36 PM | Updated on Sep 4 2017 7:30 AM

నూతన కల్లు విధానాన్ని రూపొందించాలి

నూతన కల్లు విధానాన్ని రూపొందించాలి

చౌటుప్పల్‌ : నూతన కల్లు విధానాన్ని రూపొందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చౌటుప్పల్‌ : నూతన కల్లు విధానాన్ని రూపొందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సర్ధార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జైత్రయాత్ర మంగళవారం చౌటుప్పల్‌కు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ధార్‌ సర్వాయిపాపన్న జయంతి ఉత్సవాలను ఈ నెల 18న ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కల్లుగీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.1వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలన్నారు. నీరా ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జైత్రయాత్ర కన్వీనర్‌ ఎంవీ.రమణ, పామనగండ్ల అచ్చాలు, సూదగాని రమేష్, జనగాం శ్రీనివాస్, బూడిద గోపి, అబ్బగాని భిక్షం, వెంకటమల్లు, బావయ్య, బత్తుల లక్ష్మయ్య, మునుకుంట్ల ఎల్లయ్య, వర్కాల ఇస్తారి, రాములు, అంజయ్య, వెంకటయ్య, శంకరయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement