
కోదండరాం.. మీకిది తగునా?: నాయిని
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం కొట్లాడిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం..
మేడ్చల్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం కొట్లాడిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం.. తమ ప్రభుత్వం రైతులకు సాగు నీరందించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ అత్వెల్లిలో ఏర్పాటు చేసిన హరితహారంలో మొక్కలు నాటారు. కోదండరాం ప్రతిపక్షాల ఉచ్చులో పడ్డారని నాయిని అన్నారు. ఎంసెట్-2 లీక్ దోషులను వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.