మునెయ్య సేవలు అమోఘం | muneiah transfer to kurnool | Sakshi
Sakshi News home page

మునెయ్య సేవలు అమోఘం

Aug 6 2016 11:53 PM | Updated on Sep 4 2017 8:09 AM

పెనుకొండ సబ్‌డివిజన్‌ డీవైఈఓగా విధులు నిర్వహించి కర్నూల్‌ డైట్‌కు బదిలీ అయిన మునెయ్య సే వలు అమోఘమని ప్రస్తుత డీవైఈఓ రామసుబ్బారావు అన్నారు.

హిందూపురం టౌన్‌ : పెనుకొండ సబ్‌డివిజన్‌ డీవైఈఓగా విధులు నిర్వహించి కర్నూల్‌ డైట్‌కు బదిలీ అయిన మునెయ్య సే  వలు అమోఘమని ప్రస్తుత డీవైఈఓ రామసుబ్బారావు అన్నారు. శని వారం స్థానిక చి న్మయ విద్యాలయంలో ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో మునెయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు.

రామసుబ్బారా వు మాట్లాడుతూ పెనుకొండ సబ్‌డివిజ న్‌లో మునెయ్య ఏడేళ్లుగా పని చేసి విద్యాప్రమాణాలు పెంపునకు ఎనలేని కృషి చేశారన్నారు. అనంతరం మునెయ్యను ఘనంగా సన్మానించారు.   ఎంఈఓ గంగప్ప, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు చాంద్‌బాషా, ఫణికుమార్, ప్రధానోపాధ్యాయుల సంఘం బాధ్యులు శేషగిరిరావు, గోపాల్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement