ఫైనల్‌కు ఎంపీఈడీ, సైన్స్‌ కళాశాల జట్లు | mped and science teams to final | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు ఎంపీఈడీ, సైన్స్‌ కళాశాల జట్లు

Published Thu, Feb 16 2017 10:00 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని విభాగాల జట్ల మధ్య జరుగుతున్న టీ20 సెమీస్‌ పోరులో ఎంపీఈడీ, సైన్స్‌ కళాశాల జట్లు విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని విభాగాల జట్ల మధ్య జరుగుతున్న టీ20 సెమీస్‌ పోరులో ఎంపీఈడీ, సైన్స్‌ కళాశాల జట్లు విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. వివరాలు.. ఇంజినీరింగ్‌ –1 జట్టుతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఎంపీఈడీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం ఇంజినీరింగ్‌–1 జట్టు 18 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది.

మధ్యాహ్నం ఎంబీఏ జట్టుతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కాలేజ్‌ ఆఫ్‌ సైన్సెస్‌ జట్టు 19.1 ఓవర్లలో 144 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంబీఏ జట్టు అంపైర్‌ తీరు సరిగా లేదని నిష్క్రమించింది. దీంతో కాలేజ్‌ ఆఫ్‌ సైన్సెస్‌ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. శుక్రవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. కాగా అంపైర్లు తప్పుగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎంబీఏ విద్యార్థులు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటరమణకు వినతిపత్రం అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement