కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవతో తొండూరు మండలానికి అదనంగా శనగలు మంజూరయ్యాయి.
తొండూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవతో తొండూరు మండలానికి అదనంగా శనగలు మంజూరయ్యాయి. ఆదివారం తొండూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, రైతులు ఎంపీ వైఎస్ వద్దకు వచ్చి మండలానికి తక్కువ శనగలు మంజూరయ్యాయని.. మిగతా మండలాలకు వస్తే 50శాతం మాత్రమే కేటాయించారని మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎంపీ వెంటనే జేడీఏ ఠాగూర్ నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తొండూరు మండలానికి అదనంగా 1600క్వింటాళ్లను మంజూరు చేయాలని జేడీఏకి సూచించారు. జేడీఏ వెంటనే 500క్వింటాళ్లను తొండూరు ఆగ్రోస్ కేంద్రానికి కేటాయించారు. మరో 1100క్వింటాళ్లను త్వరలోనే అందజేస్తామని జేడీఏ ఎంపీకి వివరించారు.
ఫలించిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ప్రయత్నం :
మండలానికి అదనంగా శనగ విత్తనాలు మంజూరు చేయించేందుకు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చేసిని ప్రయత్నం ఫలించింది. నాలుగు రోజుల క్రితం మండలంలోని రైతులు శనగల పంపిణీలో అన్యాయం జరిగిందని పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిపై బైటాయించి వాహనాలను అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా రైతులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్కెక్కారు. ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకొని మండలానికి శనగలు మంజూరు చేయించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.