మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నల్లగొండ జిల్లా మోత్కూరు పట్టణం జలమయమైంది.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నల్లగొండ జిల్లా మోత్కూరు పట్టణం జలమయమైంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని కల్వర్టులను పూడ్చివేయడం వల్లే వరద బీభత్సం సృష్టించిందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఏకధాటిగా ఆరుగంటల పాటు వర్షం కురవడంతో.. గ్రామంలోని రెండు పాత ఇళ్లు కూలిపోయాయి.