పాము కాటుతో వలస కూలీ మృతి | migrate coole died with snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో వలస కూలీ మృతి

Feb 8 2017 12:31 AM | Updated on Sep 5 2017 3:09 AM

బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ మహిళా కూలీ పాముకాటుకు గురై మృతి చెందింది.

కడమకుంట్ల (తుగ్గలి) : బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ మహిళా కూలీ పాముకాటుకు గురై మృతి చెందింది. మృతురాలు బావ ఎస్‌.బాషా తెలిపిన వివరాల మేరకు.. తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామానికి చెందిన రుఖియా (21) తన భర్త నబీరసూల్, రెండేళ్ల కూతురు పర్వీన్‌తో కలిసి ఈనెల 2వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో మిరప కాయలు తెంచేందుకు వలస వెళ్లారు. అదే రోజు సాయంత్రం పనిలో నిమగ్నమై ఉండగా రుఖియా పాము కాటుకు గురైంది. గమనించిన తోటి కూలీలు చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. కోమాలో ఉన్న రుఖియా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం సాయంత్రం మృతి చెందింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement