గొల్లప్రోలుకు చెందిన విద్యాకమిటీ మాజీచైర్మన్, సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షుడు పడాల రత¯ŒSభరత్ (43) చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానిక మండలపరిషత్ పాఠశాల వద్ద బుధవారం
ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి
Dec 2 2016 12:30 AM | Updated on Sep 4 2017 9:38 PM
గొల్లప్రోలు :
గొల్లప్రోలుకు చెందిన విద్యాకమిటీ మాజీచైర్మన్, సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షుడు పడాల రత¯ŒSభరత్ (43) చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానిక మండలపరిషత్ పాఠశాల వద్ద బుధవారం పెట్రోల్‌పోసుకుని ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మృతదేహంతో రాస్తారోకో..
భరత్‌మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సమాచారహక్కుప్రచార ఐక్యవేదిక సభ్యులు, కుటుంబసభ్యులు మృతదేహంతో స్థానిక రాయవరం సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఆయన మృతికి కారకులైన ఉపాధ్యాయులు, గొల్లప్రోలు ఎస్‌ఐ బి.శివకృష్ణలను వెంటనే సస్పెండ్‌చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. పిఠాపురం సీఐ ఉమర్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు, సమాచారహక్కు ఐక్యవేదిక సభ్యులకు కొంతసేపు వాగ్వాదం చోటుచేకుంది. దీంతో పెద్దలు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచారహక్కుప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు చేతన మాట్లాడుతూ భరత్‌పై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా, కొందరు ఉపాధ్యాయులు ఆయనను హతమార్చేందుకు పన్నాగం పన్నారన్నారు. మేజిస్ట్రేట్ అనుమతి లేనిదే నిందితులను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఎస్‌ఐ భరత్‌ను అరెస్ట్ చేసారన్నారు. తప్పుడు పనులు చేస్తూ, విధులకు గైర్హాజరవుతున్నారని జిల్లాకలెక్టర్‌కు భరత్ íఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఉపాధ్యాయులు పథకం ప్రకారం తప్పుడు కేసు పెట్టడమే కాకుండా ఆయన బలవన్మరణానికి కారణమయ్యారన్నారు. మేజిస్ట్రేట్ మరణ వాంగ్మూలం ప్రకారం ఎస్‌ఐను, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ఐక్యవేదిక నాయకురాలు జంగా సంతోష్‌కుమారి డిమాండ్ చేసారు. మృతుని కుటుంబానికి రూ 25 లక్షలు పరిహారం, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమాచారహక్కు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐక్యవేదిక మహిళావిభాగం అధ్యక్షురాలు నాళం ఆండాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement