స్థానిక రైల్వే జంక్షన్‌లో ఓ గుర్తుతెలియని యువకుడ గురువారం అర్ధరాత్రి 6వ నంబర్ ప్లాట్‌ఫారంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్‌పీ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
గుంతకల్లు : స్థానిక రైల్వే జంక్షన్‌లో ఓ గుర్తుతెలియని యువకుడ గురువారం అర్ధరాత్రి 6వ నంబర్ ప్లాట్‌ఫారంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్‌పీ ఎస్‌ఐ రమేష్ తెలిపారు. మృతుడి వయస్సు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుని జేబులో ఆధార్‌కార్డు లభించింది. ఇందులో రమణ అనూర్‌స్వామి అని, ముంబై ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
వృద్ధుడి మృతదేహం లభ్యం
ఇదిలా ఉండగా ప్లాట్‌పారం 1,2ల మధ్య మరుగుదొడ్ల వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఇతని వయస్సు 65 నుంచి 70 ఏళ్లు ఉంటుందని, రైల్వే జంక్షన్‌లో యాచనచేసే వ్యక్తిగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.