ఆదనపు కట్నం వేధింపుల కేసులో భర్తకు ఏడాది కఠినకారాగార శిక్షతోపాటు వేయ్యి రూపాయల జరిమాన విధిస్తు చేవెళ్ల మున్సిప్ కోర్టు జడ్జి అన్నపూర్ణశ్రీ బుధవారం తీర్పు వెల్లడించినట్లు
చేవెళ్ల: ఆదనపు కట్నం వేధింపుల కేసులో భర్తకు ఏడాది కఠినకారాగార శిక్షతోపాటు వేయ్యి రూపాయల జరిమాన విధిస్తు చేవెళ్ల మున్సిప్ కోర్టు జడ్జి అన్నపూర్ణశ్రీ బుధవారం తీర్పు వెల్లడించినట్లు చేవెళ్ల సీఐ ఉపేందర్ తెలిపారు. షాబాద్ మండలంలోని పోలారం గ్రామానికి చెందిన మిర్యాల రవీందర్‌కు అదే మండలంలోని మల్లారెడ్డి గూడ గ్రామానికి చెందిన మల్లయ్య కూతురు అమతతో 8సంవత్సరాల కిత్రం వివాహ జరిగింది.
వివాహ సమయంలో అడిగి లంచానాలు ఇచ్చారు. అయితే పెళ్లయిన మూడేళ్ల వరకు బాగానే కాపురం చేసిన రవీందర్.. భార్య అమత వికలాంగురాలు కావటంతో పిల్లలుపుట్టి చనిపోతున్నారనే సాకుతో ఆదనపుకట్నం తీసుకు రావాలని వేదింపులకు గురిచేయటం మొదలు పెట్టాడు. దీంతో 2014లో ఉమెన్స్ పోలీస్టేషన్‌లో భర్తపై పిర్యాదు చేసింది.