బాకీ చెల్లిస్తామని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి నుంచి భారీగా సొత్తు కాజేసిస సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అంబర్‌పేట: బాకీ చెల్లిస్తామని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి నుంచి భారీగా సొత్తు కాజేసిస సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ విజయభాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. అంబర్‌పేట ఎంసీహెచ్ క్యార్టర్స్‌లో నివసించే ప్రకాష్‌కు రెడ్ బిల్డింగ్ ప్రాంతంలో నివసించే శ్రీదేవి (35) కొంత డబ్బు బాకీ ఉంది.
ఈ ఏడాది మార్చి 27న ప్రకాష్‌కు ఫోన్ చేసి డబ్బులు చెల్లిస్తానని, తన ఇంటికి పిలిపించుకుంది. అతను రాగానే మాటల్లో పెట్టి ముఖం మీద పెప్పర్ స్పేర్ చల్లి అంబర్‌పేటకు చెందిన ప్రదీప్ (32)తో కలిసి ప్రకాష్‌ను ఓ గదిలో బంధించింది. అనంతరం అతడి సెల్ నుంచి ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు మన ఇంటికి వస్తున్నారని డబ్బు, బంగారు అభరణాలు, డాక్యుమెంట్లు ప్రదీప్ అనే వ్యకికి ఇవాల్సిందిగా ప్రకాష్ భార్యకు ఎస్‌ఎంఎస్ పెట్టారు. దీంతో ప్రకాష్ భార్య ప్రదీప్‌కు రూ.16 లక్షల నగదు, 40 తులాల బంగారు అభరణాలతో పాటు విలువైన డాక్యుమెంట్లు అందించింది.
కొంత సమయానికి ప్రకాష్ తేరుకొని వారిబారి నుంచి బయట పడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన ప్రకాశ్ విషయం తెలుసుకుని, వెంటనే శ్రీదేవి ఇంటికి వెళ్లి అడగ్గా చంపేస్తామని బెదిరించడంతో విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అయితే నిందితులు మరోమారు రూ.12 లక్షలు కావాలని బెదిరింపులకు పాల్పడడంతో బుధవారం రాత్రి ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.