దొంగతనం కేసులో ఓ వ్యక్తికి మూడు నెలల జైలుశిక్ష, రూ.100 జరిమానా విధించినట్లు కోర్టు కానిస్టేబుల్ బి.సురేష్ తెలిపారు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన పంతంగి నర్సయ్యకు చెందిన రెండు ఎద్దులు, ఎడ్ల బండి దొంగిలించిన కేసులో మండలంలోని బురహాన్‌పల్లికి చెందిన బొమ్మెరబోయిన కొమురయ్య నేరస్తుడని పేర్కొన్నారు.
దొంగతనం కేసులో వ్యక్తికి జైలు శిక్ష
Jul 20 2016 10:36 PM | Updated on Aug 11 2018 6:04 PM
రాయపర్తి : దొంగతనం కేసులో ఓ వ్యక్తికి మూడు నెలల జైలుశిక్ష, రూ.100 జరిమానా విధించినట్లు కోర్టు కానిస్టేబుల్ బి.సురేష్ తెలిపారు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన పంతంగి నర్సయ్యకు చెందిన రెండు ఎద్దులు, ఎడ్ల బండి దొంగిలించిన కేసులో మండలంలోని బురహాన్‌పల్లికి చెందిన బొమ్మెరబోయిన కొమురయ్య నేరస్తుడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు తొర్రూరు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శంకర శ్రీదేవి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని తెలిపారు.
Advertisement
Advertisement