ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్‌ | man dies of road accident | Sakshi
Sakshi News home page

ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్‌

Feb 22 2017 11:30 PM | Updated on Aug 30 2018 4:10 PM

ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్‌ - Sakshi

ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్‌

ఓవర్‌ టేక్‌ ఒక ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. ఆత్మకూరు సమీపంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

ఎదురుగా దూసుకొచ్చిన రెండు వాహనాలు
దారిలేక బైక్‌ను రోడ్డు పక్కకు తిప్పిన యువకుడు
చెట్టు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి
భార్య, కుమారుడికీ గాయాలు

ఆత్మకూరు : ఓవర్‌ టేక్‌ ఒక ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. ఆత్మకూరు సమీపంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన ఏకాంత్‌కుమార్‌ (35) తన భార్య సుశీలమ్మ, రెండేళ్ల కుమారుడితో కలిసి డ్రామా చూసేందుకని మంగళవారం అనంతపురంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంలో వెళ్లాడు. బుధవారం తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఆత్మకూరు మండల కేంద్రం సమీపానికి రాగానే ఎదురుగా రెండు వాహనాలు వచ్చాయి. ముందుకు పోవడానికి అవకాశం లేకపోవడంతో రోడ్డు పక్కకు తిప్పాడు.

అంతే అదుపుతప్పి చెట్ల పొదల్లోకి ద్విచక్రవాహనం వేగంగా దూసుకెళ్లింది. తలకు బలమైన గాయం కావడంతో ఏకాంత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సుశీలమ్మకు తీవ్రగాయాలయ్యాయి. మధ్యలో కూర్చున్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం కళ్యాణదూరం రూరల్‌ పరిధి కావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement