రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | man dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Dec 7 2016 11:21 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఆత్మకూరు సమీపంలో బుధవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో మల్లికార్జున (28) అనే యువకుడు మృతి చెందాడు.

ఆత్మకూరు : ఆత్మకూరు సమీపంలో బుధవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో మల్లికార్జున (28) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున బీటెక్‌ పూర్తి చేసి అనంతపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.

అయితే స్వగ్రామమైన తిమ్మాపురంలో ఓ శుభకార్యానికి బుధవారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. ఆత్మకూరు దాటగానే కళ్యాణదుర్గం నుంచి వస్తున్న లారీ వీరిని ఢీ కొంది. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement