మేకను తప్పించబోయి మృత్యు ఒడికి.. | man dies in road accident | Sakshi
Sakshi News home page

మేకను తప్పించబోయి మృత్యు ఒడికి..

Aug 16 2016 12:06 AM | Updated on Aug 30 2018 4:07 PM

రంగసముద్రానికి చెందిన త్రియంబకేశ్వర గ్రామీ ణ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హెచ్‌బీ మురుడప్ప(52) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు.

పావగడ: రంగసముద్రానికి చెందిన త్రియంబకేశ్వర గ్రామీ ణ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హెచ్‌బీ మురుడప్ప(52) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు.  స్వాతంత్య్ర వేడుకలు ముగించుకుని సరుకులు తీసుకురావడానికి బైకులో పావగడకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని శైలాపురం  వద్ద ఎదురుగా వచ్చిన మేకను తప్పించే ప్రయ త్నంలో ఈ సంఘటన జరిగిందని ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు.  మృతుడికి భార్య మంజువాణి, కుమారుడు చేతన్‌ కుమార్, కుమార్తె అశ్విని ఉన్నారు. హెచ్‌ఎం గంగాధరప్ప, ఉపాధ్యాయులు   సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement