అ‘ధర’గొడుతున్న లగ్జరీ ఎక్స్‌పో | luxury expo in hyderadad | Sakshi
Sakshi News home page

అ‘ధర’గొడుతున్న లగ్జరీ ఎక్స్‌పో

Oct 4 2015 5:17 PM | Updated on Sep 4 2018 4:52 PM

అ‘ధర’గొడుతున్న లగ్జరీ ఎక్స్‌పో - Sakshi

అ‘ధర’గొడుతున్న లగ్జరీ ఎక్స్‌పో

హైఫై లైఫ్‌స్టైల్‌కు అలవాటుపడ్డ మహానగరవాసికి అందివచ్చిన అద్భుత ప్రదర్శన... ‘ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో’. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్: హైఫై లైఫ్‌స్టైల్‌కు అలవాటుపడ్డ మహానగరవాసికి అందివచ్చిన అద్భుత ప్రదర్శన... ‘ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో’. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అరవై రకాల బ్రాండ్‌లు, సర్వీస్‌లు ఈ ప్రదర్శనలో ఆకట్టుకొంటున్నాయి. ఈ ఎక్స్‌పోలో లగ్జరీ కార్లు, బైక్‌లు, కాస్మోటిక్స్, ఆభరణాలు, వాచీలు, గాడ్జెట్లు, వస్త్రాలు, యాక్సెసరీస్ వంటివెన్నో ప్రీమియమ్ ఐటెమ్స్ ఒకదానికి మించి ఒకటి పోటీపడుతున్నాయి. స్విస్ కంపెనీ హబ్లాట్ మెన్స్ వాచీ ధర రూ.21 లక్షలు. ఆడవారి వాచీ రూ.10.7 లక్షలు. అడ్వెంచర్, స్పోర్ట్స్ బైక్‌ల రేంజ్ రూ.14 లక్షల నుంచి రూ.18 లక్షలు.

 

యూఎస్ ఇంపోర్టెడ్ ఇండియన్ స్కౌట్ బైక్స్‌లో అత్యధిక ధర రూ.48 లక్షలు! కనీస ధర రూ.15 లక్షలు. బాడీ మసాజర్ కావాలంటే రూ.1.2 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే! అన్నింటికంటే బీఎండబ్ల్యూ ఐ8 కారు ఖరీదు అక్షరాలా మూడు కోట్ల రూపాయలు! ఇవే కాదు... ఖరీదైన గృహాలంకరణ వస్తువులూ ఉన్నాయి. ఆదివారం కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement