జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేద్దాం | Let us work hard for the development of the district center | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేద్దాం

Jan 1 2017 10:17 PM | Updated on Aug 15 2018 9:37 PM

జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేద్దాం - Sakshi

జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేద్దాం

జిల్లాకేంద్రం అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్మన్ అప్పాల గణేశ్‌ చక్రవర్తి పేర్కొన్నారు.

నిర్మల్‌టౌన్ : జిల్లాకేంద్రం అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్మన్ అప్పాల గణేశ్‌ చక్రవర్తి పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయ సమావేశమందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు తాగునీటి ట్యాంక్‌లను నిర్మిస్తామని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.

పీఎంకేవీవైలో భాగంగా శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. లాజిస్టిక్స్, రిటైల్‌ విభాగాల్లో 400మంది విద్యార్థులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. కౌన్సిల్‌ సభ్యులు దానికి సహకరించాలన్నారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బంది, కౌన్సిల్‌ సభ్యులు కేక్‌ కట్‌ చేసి నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్నారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ త్రియంబకేశ్వర్‌రావు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement