గంజాయి విక్రయిస్తూ దొరికిన నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు. ఎక్సైజ్ సీఐ సాయన్న సోమవారం వివరాలను విలేకరులకు తెలిపారు.
రూ.లక్ష జరిమానా
Sep 12 2016 11:33 PM | Updated on Jul 11 2019 8:43 PM
బిచ్కుంద:
గంజాయి విక్రయిస్తూ దొరికిన నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు. ఎక్సైజ్ సీఐ సాయన్న సోమవారం వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని కందర్‌పల్లి గ్రామానికి చెందిన రాము గతంలో గంజాయి కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అయితే, రాము కొద్ది రోజులుగా గంజాయి రవాణా ప్రారంభించాడు. పది రోజుల క్రితం గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. దీంతో తహసీల్దార్ గోవర్ధన్ అతడికి రూ.లక్ష జరిమానా విధించారు. ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకంగా, రెండోసారి తప్పు చేస్తూ దొరికిన నిందితులకు జరిమానాతో పాటు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
Advertisement
Advertisement