కూలీ మృతి : కార్మికులు ఆందోళన | Labour died in jaipur power plant in adilabad district | Sakshi
Sakshi News home page

కూలీ మృతి : కార్మికులు ఆందోళన

Sep 9 2015 11:37 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ కూలీ బుధవారం ఉదయం పై నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు నుంచి జారి పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అయితే ఆ విషయాన్ని యాజమాన్యం గోప్యం ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.

ఆ క్రమంలో కూలీ మృతదేహన్ని యాజమాన్యం మాయం చేసిందని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. అందులోభాగంగా విధులు బహిష్కరించి పవర్ ప్లాంట్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement