విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలపాలి | ku stands always first | Sakshi
Sakshi News home page

విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలపాలి

Sep 15 2016 9:03 PM | Updated on Sep 4 2017 1:37 PM

విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలపాలి

విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలపాలి

పోటీ ప్రపంచంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని వైస్‌చాన్స్‌లర్‌ సుంకరి రామకృష్ణారావు అన్నారు.

మచిలీపట్నం(చిలకలపూడి): పోటీ ప్రపంచంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని వైస్‌చాన్స్‌లర్‌ సుంకరి రామకృష్ణారావు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో జాతీయ విద్యాసంస్థల ర్యాకింగ్‌ ప్రక్రియ విధివిధానాలు అనే అంశంపై సమావేశాన్ని గురువారం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలన్నీ తమ కళాశాలల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలన్నారు. జాతీయ ర్యాకింగ్‌ సిస్టమ్‌లో కళాశాల ర్యాకింగ్‌ను మెరుగుపరుచుకోవాలన్నారు. యూనివర్సిటీ రిజిష్ట్రార్‌ డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ డిజిటల్‌ ఇండియా విధానంలో అన్ని విద్యాసంస్థలు కృషి చేసి విశ్వవిద్యాలయాన్ని ర్యాకింగ్‌ సిస్టమ్‌లో ప్రధమస్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కళాశాలలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ కమిటీ సభ్యులు జి కృష్ణమోహన్, కె హనుమంతరావు, మధుసూదనరావు, వివిధ కళాశాలల ప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement