నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలి | Krishnapatnam Genco CE meet with supervisors | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలి

Sep 12 2016 11:18 PM | Updated on Sep 4 2017 1:13 PM

నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలి

నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలి

ముత్తుకూరు: ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలని ఏపీజెన్‌కో ప్రాజెక్టు సీఈ (నిర్మాణం) పీ బాలాజీ అన్నారు. సమావేశ మందిరంలో సోమవారం జరిగిన సూపర్‌వైజర్ల అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.

 
  •  ఏపీ జెన్‌కో ప్రాజెక్టు సీఈ బాలాజీ
ముత్తుకూరు:
   ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలని ఏపీజెన్‌కో ప్రాజెక్టు సీఈ (నిర్మాణం) పీ బాలాజీ అన్నారు. సమావేశ మందిరంలో సోమవారం జరిగిన సూపర్‌వైజర్ల అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. 3వ యూనిట్‌ కింద మరో 800 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం మొదలవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్ట్రక్చర్ల నిర్మాణ పనుల్లో నిర్ధేశించిన జాగ్రత్తలు పాటించాలని, భద్రతా నియమాలు ఉల్లంఘించవద్దని సూచించారు. విశ్రాంత పర్యవేక్షక ఇంజనీర్‌ కోటేశ్వరావు మాట్లాడుతూ, నేల పరీక్షలు, నీటి నమూనాల పరీక్షల అవసరాన్ని వివరించారు. ప్లాస్టరింగ్, క్యూరింగ్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృశ్య, శ్రవణ విధానం ద్వారా విశదీకరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు రమణారెడ్డి, కోటేశ్వరావు, ముఖ్య సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ, టాటా ప్రాజెక్టు ప్రతినిధి ఎల్‌ కాళేశ్వరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement