కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి | kethepalli to merge in suryapeta | Sakshi
Sakshi News home page

కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి

Oct 15 2016 9:46 PM | Updated on Sep 4 2017 5:19 PM

కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి

కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి

భీమారం(కేతేపల్లి) : కేతేపల్లి మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపాలని కోరుతూ సూర్యాపేట–మిర్యాలగూడెం రహదారిపై శనివారం మండలంలోని భీమారం గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

భీమారం(కేతేపల్లి) : కేతేపల్లి మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపాలని కోరుతూ సూర్యాపేట–మిర్యాలగూడెం రహదారిపై శనివారం మండలంలోని భీమారం గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సూర్యాపేటకు కేవలం 15 కి.మీ దూరంలో ఉన్న కేతేపల్లి మండలాన్ని నల్లగొండ జిల్లాలో కొనసాగించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలానికి చెందిన 80 శాతం మంది విద్యార్థులు సూర్యాపేటలోని పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుతున్నారని పేర్కొన్నారు. రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్‌ఐ మద్దెల క్రిష్ణయ్య సిబ్బందితో భీమారం గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.  గ్రామస్తులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ధర్నాలో ఉపసర్పంచ్‌ నాగరాజు, గ్రామస్తులు సుక్క వినయ్‌సాగర్, బడుగుల చంద్రశేఖర్, అవిరెండ్ల రమేష్, కూరెళ్ల వెంకన్న, ఆదాం, గునగంటి రాము,  రహీం, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement