కమలాపురం బాలుడు పుట్టపర్తిలో ప్రత్యక్షం | kamalapuram boy in puttaparthy | Sakshi
Sakshi News home page

కమలాపురం బాలుడు పుట్టపర్తిలో ప్రత్యక్షం

Apr 5 2017 12:23 AM | Updated on Sep 5 2017 7:56 AM

కమలాపురం బాలుడు పుట్టపర్తిలో ప్రత్యక్షం

కమలాపురం బాలుడు పుట్టపర్తిలో ప్రత్యక్షం

వైఎస్సార్‌ జిల్లా కమలాపురానికి చెందిన భారతి, రాజు దంపతుల కుమారుడు గంగరాజు(8) అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ప్రత్యక్షమయ్యాడు.

బుక్కపట్నం(పుట్టపర్తి) : వైఎస్సార్‌ జిల్లా కమలాపురానికి చెందిన భారతి, రాజు దంపతుల కుమారుడు గంగరాజు(8) అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ప్రత్యక్షమయ్యాడు. కొత్తచెరువు సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు..గంగరాజు ఇంటి నుంచి పారిపోయి వచ్చి గుత్తిలో దిగి, అక్కడి నుంచి మరో రైలులో పుట్టపర్తి చేరుకున్నాడు. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో తచ్చాడుతుండగా.. పోలీసులు గమనించి బాలుడ్ని చేరదీశారు. వివరాలు అడిగి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. అనంతరం సురక్షితంగా వారికి అప్గించారు. అందుకు పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement