వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి

వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి


రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న

జిల్లా పరిషత్‌లో అంతర్జాతీయ     వికలాంగుల దినోత్సవం


ఆదిలాబాద్ అర్బన్ : వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో అంగవైకల్యం కలిగి ఉన్న 33,722 మంది అభ్యర్థులకు గతంలో ఉన్న పింఛన్లను అధిక మొత్తంలో పెంచారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.34 లక్షల మందికి పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ అధికారి ఉమాదేవి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 13,644 అంధులు, 5,336 మంది చెవిటి, మూగ, 10,615 మంది శారీరక, 4,127 మంది మానసిక వికలాంగులు కలిపి మొత్తం 33,722 మంది ఉన్నారని తెలిపారు.



అన్ని రకాల స్కాలర్‌షిప్‌లు, వివాహ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా 50 శాతం సబ్సిడీపై రూ.లక్ష వరకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నామని, అన్ని సౌకర్యాలు ఉన్న శారీరక వికలాంగులకు పెట్రోల్‌పై రారుుతీ కూడా అందజేస్తున్నామని అన్నారు. వికలాంగులకు ప్రభుత్వ శాఖల్లో మూడు శాతం రిజర్వేషన్‌పై నియామకం చేపడుతున్నామని, మూడు చక్రాల బండ్లు, సంక కర్రలు, బ్రెరుులీ పలక, ఎంపీ3 ప్లేయర్లు, ట్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. వికలాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారుు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రాథోడ్, మహిళా సంక్షేమ అధికారి ఉమాదేవి, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top