మంచిర్యాల జేసీ వాహనం ఢీకొని ఒకరికి.. | JC Manchiryal hit someone in the vehicle .. | Sakshi
Sakshi News home page

మంచిర్యాల జేసీ వాహనం ఢీకొని ఒకరికి..

Jan 23 2017 10:12 PM | Updated on Oct 9 2018 5:27 PM

పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద రాజీవ్‌రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ సుధాకర్‌ వాహనం ఆదివారం

పెద్దపల్లిరూరల్‌ : పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద రాజీవ్‌రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ సుధాకర్‌ వాహనం ఆదివారం ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కమాన్‌ ప్రాంతంలో నివాసముండే బాల ఏసు (52) బస్టాండ్‌ ఎదురుగా రాజీవ్‌రహదారి దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అవతలి వైపు వాహనం రావడం గమనించిన ఏసు వెనక్కి మళ్లడంతో జేసీ వాహనం అతడిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమైన బాధితుడిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement