అమెరికా అధ్యక్షులు కూడా అంత చేయరేమో? | jayaprakash narayana slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షులు కూడా అంత చేయరేమో?

Oct 14 2015 7:58 PM | Updated on Aug 18 2018 5:48 PM

అమెరికా అధ్యక్షులు కూడా అంత చేయరేమో? - Sakshi

అమెరికా అధ్యక్షులు కూడా అంత చేయరేమో?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్సత్త అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్సత్త అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతి తప్ప...ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇంత రాద్ధాంతం అవసరమా అని జేపీ బుధవారమిక్కడ ప్రశ్నించారు.  గతంలో అన్నింటిని హైదరాబాద్లోనే పెట్టి...మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

ఇప్పుడూ కూడా చంద్రబాబు అలానే చేస్తున్నారని జేపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు విమాన ప్రయాణాలకు చేసిన ఖర్చు అమెరికా అధ్యక్షులు కూడా చేయరేమో అని, హుద్హుద్ నుంచి జనం కోలుకుంటుంటే సంబరాలు చేస్తారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు. ఢిల్లీకెళ్లిన చంద్రబాబు....ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి కాకుండా రాయితీల గురించి మాట్లాడుతున్నారని జేపీ ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement