ఎంసీసీ దుర్గాదేవి క్వారీ జాతర వేలం పాట ద్వారా జీపీకి రూ. లక్షా 25 వేల 500 ఆదాయం సమకూరింది.
జాతర ఆదాయం రూ.1.25 లక్షలు
Jul 17 2016 10:18 PM | Updated on Sep 4 2017 5:07 AM
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల మండలంలోని గఢ్‌పూర్ జీపీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఎంసీసీ దుర్గాదేవి క్వారీ జాతర వేలం పాట ద్వారా జీపీకి రూ. లక్షా 25 వేల 500 ఆదాయం సమకూరింది. ఈనెల 24వ తేదీన దుర్గాదేవి జాతర నిర్వహించనుండగా, పలు దుకాణాలతోపాటు వాహనపార్కింగ్ కోసం బహిరంగ వేలం పాటలో మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి 16 మంది పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన గూడ అంజయ్య రూ. లక్షా 25 వేల 500లకు వేలం పాడి దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోవ రాజు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement