జంగారెడ్డిగూడెం సీటీవో బదిలీ | jangareddygudem cto transfered | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెం సీటీవో బదిలీ

Jan 12 2017 11:51 PM | Updated on Sep 5 2017 1:06 AM

జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం సీటీవో వి.కేదారేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయనను విజయనగరం జిల్లా తోమయ్యవలస బోర్డర్‌ చెక్‌పోస్టుకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు.00

జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం సీటీవో వి.కేదారేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయనను విజయనగరం జిల్లా  తోమయ్యవలస బోర్డర్‌ చెక్‌పోస్టుకు  ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్‌ కార్యాలయంలో డీసీటీవో ఎ న్‌ .దుర్గారావు ఇటీవలే ఆకివీడుకు బదిలీ కాగా, సీటీవో కేదారేశ్వరరావును బోర్డర్‌ చెక్‌పోస్టుకు బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెంలో అనధికార వసూళ్ల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో ‘వసూల్‌ రాజాలు’ శీర్షికన గత డిసెంబర్‌ 1న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు సీటీవో వి.కేదారేశ్వరరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణ నేపథ్యంలో డీసీటీవో, సిబ్బంది తనను బెదిరిస్తున్నారని కేదారేశ్వరరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో జంగారెడ్డిగూడెం ఇన్‌ చార్జ్‌ సీటీవోగా తణుకు సీటీవో కేవీఎస్‌ ఆంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ శ్యామలరావు సీటీవో కేదారేశ్వరరావును తోమయ్యవలస బోర్డర్‌ చెక్‌పోస్టుకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement