బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం | ironleg on public drunkenness | Sakshi
Sakshi News home page

బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం

Oct 28 2016 11:39 PM | Updated on Sep 4 2017 6:35 PM

బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు.

– ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు :  బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధం మద్యం దుకాణాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులు మద్యం సేవిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో శుక్రవారం సీ.క్యాంపు సెంటర్‌లోని శిశువిహార్‌ పక్కనే ఉన్న మద్యం దుకాణం వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మద్యపానం నడిపే మద్యం వ్యాపారులు, మందుబాబులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, మూడో పట్టణ సీఐ మధుసూదనరావు ఎస్పీ వెంట ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement