గిరిజన గురుకులాల్లో 'బయో' హాజరు | InTribal gurukuls 'bio' attendance | Sakshi
Sakshi News home page

గిరిజన గురుకులాల్లో 'బయో' హాజరు

Nov 11 2016 2:20 AM | Updated on Sep 4 2017 7:44 PM

జిల్లాలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి కచ్చితంగా విద్యార్థుల నుంచి బయో మెట్రిక్‌ హాజరును నమోదు చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్‌ సుభాషణరావు కోరారు.

– డీటీడబ్ల్యూఓ హెచ్‌ సుభాషణరావు
 
కర్నూలు(అర్బన్‌):
జిల్లాలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి కచ్చితంగా విద్యార్థుల నుంచి బయో మెట్రిక్‌ హాజరును నమోదు చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్‌ సుభాషణరావు కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం స్థానిక గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌కు బయో మెట్రిక్‌ మిషన్లు, డివైజ్‌ల వినియోగానికి సంబంధించి కార్వే కంపెనీకి చెందిన ప్రతినిధులు డెమాన్‌స్ట్రేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీడబ్ల్యూఓ మాట్లాడుతు ఆయా పాఠశాలలు, గురుకులాలకు సంబంధించి ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక డివైజ్‌ మిషన్‌ ప్రకారం ప్రభుత్వం 73 మిషన్లను సరఫరా చేసిందన్నారు. అలాగే వేలిముద్రలు పడని విద్యార్థుల కోసం 24 ఐరిష్‌ మిషన్లు కూడా రానున్నాయన్నారు.  కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, ప్రిన్సిపాళ్లు ఎస్‌ఎంఏ హఫీజ్‌ఖాద్రీ, చెన్నారెడ్డి, ఎండీ ఇస్మాయిల్, సత్యవతిబాయి, బలపనూరు పర్యవేక్షకులు ధనలక్ష్మి, వార్డెన్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement