ఇంటర్ ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
కోయిలకుంట‍్ల(కర్నూలు): ఇంటర్ ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామానికి గంగన్న, సుదర్శనమ్మ దంపతుల కూతురు సుమలత (16) నంద్యాల నలంద కాలేజీలో చదువుకుంటూ ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది.
గురువారం విడుదలైన ఫలితాల్లో ఆమె ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెందిన సుమలత ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు కోయిలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోయిలకుంట్ల ఎస్సై మంజునాథ్ తెలిపారు.