గంజాయి స్మగ్లర్ల సమాచారం సేకరించాలి | Information collected for marijuana smugglers | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లర్ల సమాచారం సేకరించాలి

Aug 20 2016 12:03 AM | Updated on Sep 4 2017 9:58 AM

గతంలో గంజాయి కొనుగోళ్లు, అమ్మకాలకు పాల్పడిన నిందితుల పూర్తి సమాచారం సేకరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు అన్నారు. ఆత్మకూరు పోలీ సులు గురువారం హన్మకొండ ప్రాంతానికి చెం దిన వంగ ఆనసూర్య, నరేందర్‌ను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.10 లక్షల విలువైన 160 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

  • అక్రమాలను అరికట్టేందుకు చర్యలు 
  • సీపీ సుధీర్‌బాబు 
  • వరంగల్‌ : గతంలో గంజాయి కొనుగోళ్లు, అమ్మకాలకు పాల్పడిన నిందితుల పూర్తి సమాచారం సేకరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు అన్నారు. ఆత్మకూరు పోలీ సులు గురువారం హన్మకొండ ప్రాంతానికి చెం దిన వంగ ఆనసూర్య, నరేందర్‌ను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.10 లక్షల విలువైన 160 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని గురువారం రాత్రి సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అససూర్య, నరేందర్‌ ముఠాగా ఏర్పడి ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దామెర గ్రామం అడ్డా గా శుద్ధి చేసిన గంజాయి కొంటూ, అమ్ముతున్నారని విచారణలో తేలిందన్నారు. నర్సంపేట, వెంకటాపూర్‌ ప్రాంతాలకు చెందిన మహేందర్, ఇజ్జగిరి రవి వద్ద శుద్ధి చేసిన గంజాయిని తక్కు వ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతంలో అమ్ముతున్నారని వివరించా రు. కాజీపేట్‌ ఎసీపీ జనార్దన్‌ ఆదేశాల మేరకు ఆత్మకూరు పోలీసులు దామెరలో దాడు లు చేశారని తెలిపారు. నిల్వ చేసిన 160 కిలోల గంజాయి ని 2 కిలోల చొప్పున 80 ప్యాకెట్లుగా చేసి గోనే సంచిలో ఉంచి మహారాష్ట్రకు తరలించే క్రమంలో పట్టుబడ్డారని తెలి పారు. కమిషనరేట్‌ పరిధిలో గుట్కాలు, గం జాయి సరఫరాకు పాల్పడే వ్యక్తులను ఉపేక్షిం చేదిలేదని హెచ్చరించారు. గుట్కా, గంజాయి నిల్వలకు సంబంధించిన సమాచారం తెలిస్తే డయల్‌ నెం.100, పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌ 9491089257కు సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉం చుతామని చెప్పారు. ఆయన వెంట కాజీపేట ఎసీపీ జనార్దన్, ఆత్మకూరు సీఐ రవికుమార్, ఎస్సై విఠల్‌ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement