అభిమానుల రుణం తీర్చుకోలేనిది : నారా రోహిత్ | hero nara rohit visitation to anantapur | Sakshi
Sakshi News home page

అభిమానుల రుణం తీర్చుకోలేనిది : నారా రోహిత్

Jul 4 2016 9:08 AM | Updated on Jun 1 2018 8:39 PM

అభిమానుల రుణం తీర్చుకోలేనిది : నారా రోహిత్ - Sakshi

అభిమానుల రుణం తీర్చుకోలేనిది : నారా రోహిత్

అనంతలో సేవా భావం కలిగిన అభిమానులుండడం ఆనందంగా ఉందని, ఇక్కడ ఒక సినిమా చేయాలనుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు.

అనంతపురం: అనంతలో సేవా భావం కలిగిన అభిమానులుండడం ఆనందంగా ఉందని, ఇక్కడ ఒక సినిమా చేయాలనుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. నారా పవర్ ఆఫ్ యూత్ సంస్థ  ఆధ్వర్యంలో నారా రోహిత్  ఆదివారం నగరంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

నారాయణ సేవ పేరిట నిత్యం అన్నదానం చేస్తున్న విజయ్‌సాయికుమార్ సేవలను కొనియాడారు. మునిసిపల్ అతిథి గృహంలో అభిమానులతో సమావేశమై వారితో ముచ్చటించారు. బాలయ్యతో పాటు తన చిత్రాలను ఆదరిస్తున్న నందమూరి అభిమానుల రుణం తీర్చుకోలేనిదన్నారు. తన అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, వారికి తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు.

లలితకళాపరిషత్తులో జరిగిన వైద్య శిబిరంలో దాదాపు 500 మందికి ఉచిత వైద్య సేవలందించారు. అదేవిధంగా రోహిత్ అభిమాన సంఘం వారు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి, హీరో నారా రోహిత్, నిర్వాహకులు ధనుంజయ నాయుడు బృందాన్ని అభినందించారు. అనంతరం ప్రభుత్వ జనాసుపత్రిలో సాయి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత జగన్, మారుతీప్రసాద్ తదితరులతో పాటు నారా రోహిత్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement