తృటిలో తప్పిన ప్రమాదం | Heavy fire in a car | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

Aug 19 2016 8:41 PM | Updated on Apr 3 2019 7:53 PM

తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

తృటిలో తప్పిన ప్రమాదం

అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది.

మంటల్లో చిక్కుకున్న కారు 
 
వరగాని (పెదనందిపాడు): అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది. స్థానికులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఏపీ 27 టిఎక్స్‌ 7930 నెంబరు గల టావెరా కారులో  ప్రయాణికులతో ఇంకొల్లు నుంచి విజయవాడ పుష్కరాలకు వెళ్ళారు. తిరుగు  ప్రయాణంలో పెదనందిపాడు మీదుగా ఇంకొల్లు వెళుతుండగా మండల పరిధిలోని గుంటూరు పర్చూరు రహదారిలో శ్రీనివాస కాటన్‌ అండ్‌ ఆయిల్‌ మిల్స్‌ వద్దకు వచ్చెసరికి కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

అప్రమత్తమైన డ్రైవరు అజయ్‌కుమార్‌ కారులోని ప్రయాణికులను కిందికి దించడంతో  ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఫైరింజన్‌ చాలా అలస్యంగా వచ్చింది. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు, సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement