జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి | guntakal team in khokho finals | Sakshi
Sakshi News home page

జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి

Sep 1 2016 11:29 PM | Updated on Sep 4 2017 11:52 AM

జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి

జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి

ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో రాణించి జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ సూచించారు.

– గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌
గుంతకల్లుటౌన్‌ : ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో రాణించి జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ సూచించారు. స్థానిక ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో గురువారం ఎస్కేయూ అంతర కళాశాలల గ్రూప్‌–బీ టోర్నమెంట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ బి.జెస్సీ ఎస్కేయూ టోర్నీ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారులు, ఎన్‌సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

కాలేజి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రియో ఒలంపిక్స్‌లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేసిన సింధూ, సాక్షి మాలిక్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్‌ పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి. జిల్లాలోని 18 ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల నుంచి∙400 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్‌  తెలిపారు. కార్యక్రమంలో  ఏపీపీడీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముస్తాక్‌ , ఎస్కేయూ పీడీ అసోసియేషన్‌ అధ్యక్షుడు జబీవుల్లా,   టీడీపీ నాయకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement