ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోదాడరూరల్: ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. మునగాల మండలం ఆకుపాముల శివారులోగల ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థిని పదోతరగతి చదువుతోంది. కోదాడ మండలం కొమరబండకు చెందిన బొబ్బిలి రాజు అదే స్కూల్‌లో టీచర్. మంచి మార్కులు వచ్చే విధంగా పాఠాలు చెప్తానని విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఈ నెల 15న ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను భయపెట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రు లు కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ చరమందరాజు తెలిపారు.