జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్టు క్రీడలు ప్రారంభం | Genco International Project Start Sports | Sakshi
Sakshi News home page

జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్టు క్రీడలు ప్రారంభం

Aug 29 2016 11:57 PM | Updated on Sep 4 2017 11:26 AM

మూడు రోజుల పాటు జరగనున్న జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్‌ బాల్‌ బ్యాడ్మింటన్, చెస్‌ క్రీడా పోటీలు సోమవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రారంభమయ్యాయి.

పాల్వంచ (ఖమ్మం) : మూడు రోజుల పాటు జరగనున్న జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్‌ బాల్‌ బ్యాడ్మింటన్, చెస్‌ క్రీడా పోటీలు సోమవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్‌ సెంట్రల్‌ ఆఫీస్‌ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం సీఈ వి.మంగేష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాపతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పోటీల్లో ఆర్‌టీపీఎస్‌(రామగుండం), శ్రీశైలం, కేటీపీపీ(భూపాలపల్లి), జూరాల, కేటీపీఎస్‌ ఓ అండ్‌ఎం, కేటీపీఎస్‌ 5,6 దశల టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, జెన్‌కో స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ లోహిత్‌ ఆనంద్, డిప్యూటీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్, ఎస్‌ఈ వి.కిషన్, స్పోర్ట్స్‌ సెక్రటరీ టి.వీరస్వామి, వైటీఎంకే.రాజు, కట్టా శ్రీధర్, బి.రామారావు, పీలే శ్రీనివాస్, రిఫరీలు బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement