ఊరిస్తున్న మేఘాలు | Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న మేఘాలు

Published Sat, Sep 10 2016 7:11 PM

దట్టంగా అలుముకున్న మేఘాలు - Sakshi

రాయికోడ్‌: భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశంలోని మేఘాలు ఊరిస్తున్నాయి. గత రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో వాతావరణం చల్లబడుతున్నప్పటికీ వానలు కురవడంలేదు. మండలంలో సాగువుతున్న పత్తి మొక్కలు వర్షాలు లేక ఎండుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు కురవాలని కోరుకుంటున్న రైతులకు నిరాశే ఎదురైంది.

ఆగష్టులో సాధారణ వర్షాపాతం కంటే తక్కువగా నమోదైంది. 215 ఎంఎం వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా 50 శాతం వర్షాపాతమే కురిసింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురై వర్షాల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోఘాకాశంలో దట్టంగా అలుముకుంటున్న నల్లని మేఘాలు రైతులకు ఊరిస్తున్నాయి. భారీ వర్షాలు కురవాలని మండల రైతాంగం వేడుకుంటోంది.

Advertisement
Advertisement